డ్రైవింగ్ చేస్తూ.. ఫోన్ మాట్లాడితే సిగ్నల్స్ కట్..! | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్ చేస్తూ.. ఫోన్ మాట్లాడితే సిగ్నల్స్ కట్..!

Published Wed, Jun 18 2014 4:28 AM

డ్రైవింగ్ చేస్తూ.. ఫోన్ మాట్లాడితే సిగ్నల్స్ కట్..! - Sakshi

ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపడం వల్ల తరచూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటా యి. అందుకే వాహనాన్ని నడుపుతూ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడితే ఫోన్ సిగ్నళ్లను నిలిపివేసే వినూత్న పరికరాన్ని తమిళనాడులోని ఏవీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ, నాలెడ్జి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన అబ్దుల్ షబ్బీర్, అబ్దుల్ జుబార్‌లు తయారు చేశారు. అగ్గిపెట్టె అంత మాత్రమే ఉండే ఈ పరికరంలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్, పైన ఓ యాంటెనా ఉం టాయి. దీనిని సరిగ్గా డ్రైవర్ తలపై ఉండేలా వాహనం పైకప్పుకు అమరుస్తారు. డ్రైవర్ సెల్‌ఫోన్‌లో కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు లేదా ఫోన్‌కాల్ చేసినప్పుడు వెలువడే రేడియేషన్‌ను గుర్తించి ఇది వెంటనే హెచ్చరిస్తుంది. డ్రైవర్ కారు ఆపి మాట్లాడితే సరి.. లేకపోతే 8 సెకన్ల తర్వాత ఆటోమేటిక్‌గా మొబైల్ జామర్‌ను ఆన్‌చేస్తుంది. అవసరమైతే డ్రైవర్ ఎదురుగా ఉండే కెమెరా సాయంతో ఫొటో తీస్తుంది.
 
 కారు నంబరుతో సహా వివరాలను సమీపంలోని పోలీసు కంట్రోల్ రూంకు సందేశం పంపుతుంది. మారుతి ఓమ్నీ వ్యాన్‌లలో ఈ పరికరాన్ని ఉపయోగించగా వివిధ సెల్‌ఫోన్‌లను విజయవంతం గా అడ్డుకుందట. అన్నట్టూ.. డ్రైవర్ సెల్‌ఫోన్ నుంచి మాత్రమే 75 మిల్లీ ఓల్టుల వరకూ రేడియేషన్ ఈ పరికరానికి అందుతుందని, వాహనంలో ని మిగతావారి సెల్‌ఫోన్ల రేడియేషన్ ఈ స్థాయిలో దీనికి అందదు కాబట్టి.. ఆ ఫోన్లకు ఇది ఎలాంటి అంతరాయమూ కలిగించదని పరిశోధకులు తెలిపారు. దీన్ని తొలగించాలని లేదా ధ్వంసం చేయాలని చూసినా పోలీసులకు సమాచారం పంపుతుందట. ధర రూ.450 నుంచి రూ.700 మాత్రమే కాబట్టి.. దీనిని అన్ని వాహనాలకు తప్పనిసరి చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement