ట్రైన్‌లో ఫోటోషూట్‌.. వైరలవుతోన్న వీడియో

21 Aug, 2019 12:01 IST|Sakshi

వాషింగ్టన్‌: ఫోటో షూట్‌ అనగానే.. సినిమా తారలు, మోడల్స్‌ మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఫోటో షూట్‌లు జరిగే ప్రదేశాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక సాధరణ జనాలు కూడా ఈ ఫోటోషూట్‌లకు బాగా అలవాటు పడిపోయారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు క్లిక్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. మురిసిపోతుంటారు. అయితే ఇప్పడు మీరు చదవబోయే ఫోటోషూట్‌ మాత్రం వీటన్నింటికి కాస్త భిన్నమైంది. ఎందుకంటే ఈ ఫోటోషూట్‌ జరిగింది ఓ రైలులో కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాక ఫోటోషూట్‌ చేసిన మహిళ ధైర్యాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

న్యూయార్క్‌ లోకల్‌ ట్రైన్‌లో చోటు చేసుకున్న ఈ వైరటీ ఫోటోషూట్‌ వివరాలు.. జెస్సికా జార్జ్‌ అనే మహిళ లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఫోటోషూట్‌ చేసింది. ఇందుకు గాను జెస్సికా తన స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ టైమర్‌ను సెట్‌ చేసి రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగుతూ సందడి చేసింది. ఆ సమయంలో రైలులో జెస్సికాతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఆమె వారిని పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న బెన్‌ యహర్‌ ఈ తతంగాన్నంతా వీడియో తీసి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. తెగ వైరలవుతోన్న ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జెస్సికా ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ‘అంత మందిలో సెల్ఫీ ఫోటోషూట్‌ చేసిన నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం’.. ‘పబ్లిక్‌లో ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా