నైజీరియాలో ఆత్మాహుతి దాడి | Sakshi
Sakshi News home page

నైజీరియాలో ఆత్మాహుతి దాడి

Published Tue, Jun 18 2019 6:25 AM

Nigeria suicide blast kills 30 at video hall in Borno - Sakshi

కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రద్దీ ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 30 మంది మరణించగా.. 40 మందికి గాయాలయ్యాయి. నైజీరియా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కి.మీ దూరంలో ఉన్న కొండుగ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన తీరును బట్టి ఇది బొకో హరామ్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నామని ఆ దేశ అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

ఫుట్‌బాల్‌ అభిమానులందరూ కలిసి ఓ హాల్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని సదరు హాల్‌ యజమాని నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయిం దని.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక ఆత్మరక్షణ దళ నేత హాసన్‌ వెల్లడించారు. అప్పటికే జనాల్లోకి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు సహా ఈ వ్యక్తి తమను తాము పేల్చుకున్నారని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే మరణించగా మిగతా వారు చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పారు. ఎమర్జెన్సీ దళాలు ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని అత్యవసర విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement
Advertisement