పాక్లో ఐసిస్ లేదట | Sakshi
Sakshi News home page

పాక్లో ఐసిస్ లేదట

Published Fri, Feb 12 2016 10:13 AM

No organised IS presence in Pakistan

ఇస్లామాబాద్: ఓ పక్క ప్రపంచం మొత్తంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ అనుచరులను పెంచిపోషిస్తున్నారని, వారి నుంచి ఎప్పటికైనా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాల నిఘా వర్గాలు హెచ్చరిస్తుండగా ఉగ్రవాదం ఎక్కువగా బుసలు కొట్టే పాకిస్థాన్లో మాత్రం అసలు అలాంటి చాయలే లేవంట. తమ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం లేదని పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది.

తమ దేశంలో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన ఆనవాల్లేవి కనిపించలేదని, ఇక వారు వ్యవస్థీకృతంగా తమ దేశంలో ఉండటమనేది అసంభవం అని పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా ఒక ప్రకటనలో విడుదల చేశారు. అయితే, పాకిస్థాన్కు చెందిన జాతీయ నిఘా విభాగం చీఫ్ అఫ్తాబ్ సుల్తాన్ తమకు ఇస్లామిక్ స్టేట్ సంస్థ నుంచి ముంపు పొంచి ఉందని గతవారం హెచ్చరించడ గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement