Sakshi News home page

పిల్లికి నోటీసులు

Published Tue, Jun 28 2016 2:15 AM

పిల్లికి నోటీసులు

హూస్టన్: చాలా ఏళ్లుగా ఉంటున్న చోటును ఉన్నపళంగా ఖాళీ చేయాలని ఆదేశాలు అందితే కష్టం కదా. జంతువులకూ ఇది సమస్యే.అమెరికాలోని ఓ పిల్లి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొం టోంది. టెక్సాస్‌లోని వైట్ సెటిల్‌మెంట్ నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో బ్రౌజర్ అనే పిల్లి ఆరేళ్లుగా ఉంటోంది. 30 రోజుల్లోగా అక్కడి నుంచి వెళ్లి  పోవాలని దాని కి ఆ నగర పాలకమండలి నోటీసులిచ్చింది.

పిల్లల,ప్రజల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి, కౌన్సిల్ సభ్యుల మధ్య జరిగిన ఓటింగ్‌లో 2-1 తేడాతో బ్రౌజర్‌ను పంపిం చేయాలని తీర్మానించారు. ఈ లైబ్రరీ ఓ జూ నుంచి బ్రౌజర్‌ను దత్తత తీసు కుంది.  కంప్యూటర్ కీబోర్డులపై విశ్రాంతి తీసుకోవడం, అక్కడ జరిగే ప్రత్యేక తరగతులకు హాజర వడం దాని వ్యాపకాలని అక్కడి వారు చెబుతున్నారు.

Advertisement
Advertisement