మహిళా సైనికుల నగ్న ఫొటోల కలకలం | Sakshi
Sakshi News home page

మహిళా సైనికుల నగ్న ఫొటోల కలకలం

Published Mon, Mar 6 2017 9:45 AM

మహిళా సైనికుల నగ్న ఫొటోల కలకలం - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో మహిళా సైనికులకు అవమానం జరిగింది. నేవీలో పనిచేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలను సోషల్‌ మీడియాకు, ఆయా వెబ్‌సైట్లకు ఎవరో లీక్‌ చేశారు. ఈ విషయం తెలిసి ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు సత్వర దర్యాప్తును ప్రారంభించారు. చిన్నస్థాయి నుంచి పెద్ద హోదాల్లో మహిళ సైనిక ఉద్యోగుల ఫొటోలు లీకయినవాటిల్లో ఉన్నాయంట. దీని వెనుక మిలిటరీ అధికారుల హస్తం ఉందని అంటున్నారు.

ఈ ఘటనకు సంబంధించి నేవీ పటాల అధికారిక ప్రతినిధి ఓ మీడియాకు వివరాలు చెబుతూ దీని వెనుక ఎంతమంది మిలటరీ అధికారుల హస్తం ఉందో, ఎవరు ఈ కుట్ర చేశారో తెలియాల్సి ఉందని చెప్పారు. నేవి దళ నేరాలు పరిశోధించే దర్యాప్తు విభాగం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్కడి ఓ పేపర్‌ తెలిపిన వివరాల ప్రకారం నేవీ దళానికి సంబంధించి ఓ ఫేస్‌బుక్‌ గ్రూప్‌ పేజీ ఉంది. ఇందులో 30 వేలమంది సభ్యులు ఉన్నారు.

ఈ గ్రూప్‌లోనే సదరు నేవీ మహిళా అధికారుల నగ్న చిత్రాలు పెట్టారంట. దీంతో ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్‌ పేజీని మూసి వేశారు. మహిళా అధికారుల నగ్న చిత్రాలు, వారి వివరాలు, ర్యాంకులు, పేర్లు పనిచేస్తున్న విభాగం వివరాలతో సహా ఇందులో పోస్ట్‌ చేశారంట. ఈ ఘటనపై అమెరికా నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement