హిల్లరీ ర్యాలీలకు జనం రావడంలేదు అందుకే.. | Sakshi
Sakshi News home page

హిల్లరీ ర్యాలీలకు జనం రావడంలేదు అందుకే..

Published Sun, Nov 6 2016 11:02 AM

హిల్లరీ ర్యాలీలకు జనం రావడంలేదు అందుకే.. - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పూర్తి సమయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. హిల్లరీకి ఏమాత్రం జనాకర్షణ లేదని అందుకే ఆమె ఒబామా సహాయం తీసుకుంటున్నారని ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఎద్దేవా చేశారు. హిల్లరీ తనకోసం తాను ప్రచారం కూడా నిర్వహించుకోలేకపోతున్నారని.. ఆమె సొంతంగా నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కేవలం 400 నుంచి 500 మంది ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని అన్నారు. అందుకే ఆమె ఒబామాపై ఆధారపడుతున్నారని ట్రంప్ విమర్శించారు.

చివరి దశ ప్రచారపర్వంలో హిల్లరీకి మద్దతుగా కీలకమైన ఫ్లోరిడా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఒబామా ఉధృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. మీడియా వ్యవహరిస్తున్న తీరుపట్ల కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తన ప్రచారకార్యక్రమాలకు జనం తక్కువగా కనిపిస్తే మీడియా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా హెడ్‌లైన్‌లలో వార్తలు ప్రచురిస్తాయని.. అదే హిల్లరీ విషయంలో మాత్రం అలా జరగటం లేదని ట్రంప్ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement