Sakshi News home page

యూఎస్లో మళ్లీ పేలిన గన్.. ఒకరు మృతి

Published Fri, Sep 4 2015 11:51 AM

One dead, one injured in California college shooting

లాస్ఎంజెల్స్: మరోసారి అమెరికాలో గన్ పేలింది. సాక్రామెంటోలోని కాలిపోర్నియా కాలేజీ క్యాంపస్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కాలేజీ ప్రాంగణమంతటా కూడా అప్రమత్తత ప్రకటించారు. ఈ కాల్పులకు ఒక్కడే పాల్పడినట్లు తెలిసిందని, ఆ అనుమాన వ్యక్తి మాత్రం పారిపోతూ కనిపించినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాల్పులు జరిగినప్పటి నుంచి కాలేజీని మూసి వేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement