Sakshi News home page

ప్రాణాలు అరచేతబట్టుకొని 56 వేలమంది..

Published Wed, Nov 16 2016 9:32 AM

ప్రాణాలు అరచేతబట్టుకొని 56 వేలమంది.. - Sakshi

మోసుల్: ఇరాక్ ప్రధాన నగరం మోసుల్ను మరో 56వేలమంది ప్రజలు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రాణాలు అరచేతబట్టుకొని సమీపంలోని ప్రాంతాలకు పరుగులు తీశారు. కట్టుబట్టలతో వారు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడి హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి మోసుల్ ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా-ఇరాక్ సంయుక్త బలగాలు గత నెల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు వారాల్లో నవంబర్ 4న 22,224మంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లగా తాజాగా ఒకేసారి 56 వేలమంది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అటు ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య బీకర యుద్ధం జరుగుతోంది. బాంబులు, మోర్టార్ షెల్స్, బుల్లెట్ల వర్షంతో మోసుల నగరమంతా మారిమోగిపోతోంది. ఎలాగైన ఉగ్రవాదుల తుడిచిపెట్టి ప్రశాంతమైన నగరాన్ని తిరిగి ప్రజలకు అప్పగించాలనే దృఢనిశ్చయంతో బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడంతో వారంతా ప్రాణాలు అరచేతబట్టుకొని వలసదారులుగా వెళ్లి తమ నివాసాలకోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పునరావాసం కోసం బలగాలే దాదాపు వెయ్యికిపైగా టెంటు షెల్టర్లు కూడా ఏర్పాటుచేశారు.

Advertisement
Advertisement