Sakshi News home page

నెట్‌తో సొంత నిర్ణయాలు

Published Fri, May 13 2016 2:06 AM

నెట్‌తో సొంత నిర్ణయాలు - Sakshi

వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగించే పిల్లలు సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిర్ణయాలను సొంతంగా నెట్ నుంచి క్రమంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెట్ వాడకుండా నిషేధించడం కంటే వినియోగించేలా చేయడ మే పిల్లల  విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న ఉత్తమ నిర్ణయం అవుతుందని స్పష్టంచేశారు. యుక్తవయసులో ఉన్న 68 మందిపై రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారంప్రపంచ వ్యాప్తంగా 92 శాతం టీన్స్ నెట్ వాడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement