'తాలిబన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం' | Sakshi
Sakshi News home page

'తాలిబన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం'

Published Fri, Feb 26 2016 9:44 AM

Pakistan approaches Taliban factions for Afghan peace talks

ఇస్లామాబాద్: అప్ఘనిస్తాన్ శాంతి చర్చల కోసం తాను ఉగ్రవాద సంస్థలు తాలిబన్, ఇతర సంస్థలన్నిటిని సంప్రదిస్తున్నానని పాకిస్థాన్ తెలిపింది. ఆ సంస్థల ప్రతినిధులను అఫ్ఘనిస్తాన్తో శాంతియుత చర్చల కోసం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. తాలిబన్లతో నేరుగా శాంతి చర్చలకు అఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, చైనా, అమెరికా అధికారులు అంగీకరించిన అనంతరం వారిని తీసుకొచ్చే బాధ్యతను పాక్ తీసుకొంది.

తాలిబన్ సంస్థ, హిజ్బీ ఈ ఇస్లామితో మార్చి మొదటి వారంలో చర్చలు జరగనున్నట్లు తెలిసింది. 'తాలిబన్ సంస్థకు చెందిన అన్ని శాఖల ప్రతినిధులు ప్రత్యక్ష శాంతి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించాం. ఇస్లామాబాద్లో జరగనున్న ఈ తొలి విడత సమావేశానికి వారు వస్తారని మేం ఆశిస్తున్నాం' అని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ నఫీజ్ జకారియా చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement