పాకిస్తాన్‌, ఖతర్‌, టర్కీలకు అమెరికా షాక్‌ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌, ఖతర్‌, టర్కీలకు అమెరికా షాక్‌

Published Mon, Oct 2 2017 9:54 AM

Pakistan sponsors of terrorism'

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌, ఖతర్, టర్కీ దేశాలకు అమెరికా త్వరలో ఊహించని షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌, టర్కీ, ఖతర్‌ దేశాలను ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాల జాబితాలో అమెరికా చేర్చవచ్చని మాజీ పెంటగాన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలను ఉగ్రవాద దేశాలుగా ప్రకటించడానికి ఇంతకుమించిన సమయం లేదని కూడా అయన చెప్పారు.

పాకిస్తాన్‌లో ఉగ్రవాద తండాలున్నాయని.. ఈ విషయం ప్రపంచానికంతా తెలుసని అమెరికన్‌ ఎంటర్‌ప్రైస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏఈఐ) స్కాలర్‌ మైఖెల్‌ రూబెన్‌ చెప్పారు. ఉగ్రవాదులకు ఆయుధ, ఆర్థిక, సైనిక సహకారాలను పాకిస్తాన్‌ ఎన్నో ఏళ్లుగా అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాదిరిగానే అమెరికా కూడా 1979 నుంచి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాల జాబితాను ప్రకటిస్తోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి అడ్డాలుగా మారిన సిరియా, లిబియా, ఇరాక్, దక్షిణ ఎమెన్‌, క్యూబా, ఇరాన్‌, సూడాన్‌, దక్షిణ కొరియాలను ఇప్పటికే ఉగ్రవాద దేశాలుగా అమెరికా ప్రకటించింది. ఈ జాబితా నుంచి చాలా కొన్ని దేశాలకు తరువాత మినహాయింపులు ఇచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మళ్లీ ఉగ్రవాదం పెట్రేగుతున్న సమయంలో అందుకు అవకాశమిస్తున్న పాకిస్తాన్‌, టర్కీ, ఖతర్‌లను ఆ జాబితాలో చేర్చాలని పెంటగాన్‌ మాజీ అధికారి, ఏఈఐ స్కాలర్‌ హైఖేల్‌ అంటున్నారు. ఉగ్రవాద అడ్డా నిలిచాన.. ఇంత కాలం పాటూ.. టెర్రరిస్ట్‌ కంట్రీస్‌ జాబితాలో చేరకుండా పాకిస్తాన్‌ తప్పించుకుందని వారు స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ గూఢచర్య సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) బహిరంగంగానే ఉగ్రవాద సంస్థలైన తాలిబన్‌,  జైషే మహమ్మద్‌, లష్కే తోయిబాలకు మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు పాకిస్తాన్‌ ఆశ్రయం కల్పించిందని.. పాక్‌ అండతోనే లాడెన్‌ సురక్షింతగా అబోట్టాబాద్‌లో నివసించారని వారు పేర్కొన్నారు. గతంలో బుష్‌, ఒబామాలు.. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో పాకిస్తాన్‌ సహకారం అవసరం అన్న కోణంలోనే ఆ దేశాన్ని చూసిచూడనట్టు వదిలేశారని.. ఇప్పుడు ఆ అవసరం లేదని పెంటగాన్‌ మాజీ అధికారి అన్నారు. పాకిస్తాన్‌ను ఇప్పుడు క్షమించడమంటే.. లక్షలాది అమెరికన్ల భద్రతను పణంగా పెట్టడమేనని పెంటగాన్‌ అధికారి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement