పాక్‌ ప్రధానిగా షరీఫ్‌ సోదరుడు? | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధానిగా షరీఫ్‌ సోదరుడు?

Published Sun, Jul 23 2017 1:29 AM

పాక్‌ ప్రధానిగా షరీఫ్‌ సోదరుడు? - Sakshi

లాహోర్‌/ఇస్లామాబాద్‌: పనామా పత్రాల కేసులో పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారిస్తే ఆయన సోదరుడు, పంజాబ్‌ సీఎం షహబాజ్‌ షరీఫ్‌ తదుపరి ప్రధాని అయ్యే వీలుంది. షహబాజ్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యే దాకా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టొచ్చని అధికార పీఎంఎల్‌ఎన్‌ నాయకుడు తెలిపారు.

ఆలోగా షరీఫ్‌ సోదరుడు షహబాజ్‌ లేదా ఆయన భార్య కల్సూమ్‌లలో ఒకరు జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే మిగిలిన పదవీ కాలానికి వారే ప్రధానిగా ఉంటారని వెల్లడించారు. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచాక షరీఫ్‌ తన న్యాయ సలహాదారులతో విస్తృతంగా చర్చించారని తెలిపారు.

Advertisement
Advertisement