Sakshi News home page

'మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. ఆపేయ్'

Published Mon, Aug 15 2016 8:36 AM

'మమ్మల్ని రెచ్చగొట్టొద్దు.. ఆపేయ్'

సియోల్: తమను పదేపదే రెచ్చగొట్టవద్దని, అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా విడిచిపెట్టాలని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గివున్ హై విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అమెరికాతో దక్షిణ కొరియా కొనసాగిస్తున్న యాంటీ మిసైల్ సిస్టం ప్రొగ్రాంను సమర్థించుకున్నారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఉత్తర కొరియా ముందునుంచే దిగుతోందని చెప్పారు. సోమవారం దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె తొలిసారి అధికారికంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

జపానీయుల పాలన నుంచి విముక్తి పొందినప్పటి నుంచి ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తయారైంది. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదు. గత జనవరిలోనే అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా ఈ నెలలో కూడా అణు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు పార్క్ ఈ మేరకు విజ్ఞప్త చేశారు. వెంటనే రెచ్చగొట్టే చర్యలు నిలిపేయాలని, తమ దేశాన్ని టార్గెట్ చేసుకొని మిసైల్ ప్రోగ్రాం చేయొద్దని సూచించారు. సమస్త ప్రజానీకాన్ని ధ్వంసం చేసే అణ్వాయుధాల కార్యక్రమం మానుకోవాలని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement