భారత్పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..! | Sakshi
Sakshi News home page

భారత్పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..!

Published Tue, Jan 5 2016 10:36 AM

భారత్పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..! - Sakshi

వాషింగ్టన్: భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంపట్ల అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముంపు పొంచి ఉందనడానికి ఇదొక హెచ్చరికలాంటిదని అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపైనా, మరోపక్క, అఫ్గానిస్థాన్లోని భారత దౌత్య కార్యాలయంపైన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీలో కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మాన్(61) ఆందోళన వ్యక్తం చేశారు.

ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్లో పర్యటించిన మూలంగానే ఈ దాడి జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయినా, ఆ రెండు దేశాల నేతల ఏ మాత్రం వీటికి వెరువకుండా పరిష్కార మార్గాలకోసం ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలిపెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాకిస్థాన్ కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకారం అందించాలని కోరారు. ఈ దాడులు ప్రపంచ దేశాలకు మరో హెచ్చరిక అనే విషయం ఏ మాత్రం మర్చిపోకూడదని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement