'ట్రంప్ను అభ్యర్థి రేస్ నుంచి తప్పించండి' | Sakshi
Sakshi News home page

'ట్రంప్ను అభ్యర్థి రేస్ నుంచి తప్పించండి'

Published Wed, Dec 9 2015 10:08 PM

'ట్రంప్ను అభ్యర్థి రేస్ నుంచి తప్పించండి' - Sakshi

న్యూయార్క్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ సీరియస్గా తీసుకుంది. ఏకంగా ట్రంప్ అధ్యక్ష బరినుంచి తప్పుకోవాలంటూ బ్రిటన్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఒక్క రోజే లక్ష మంది ప్రతినిధుల సంతకాల సేకరణ జరిగింది. కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన పిలుపునిచ్చిన విషయం అందరికీ విదితమే.

బ్రిటన్లోకి ఎవరైనా రావచ్చని కొందరు అంటుండగా, డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో మరికొంత మంది ఏకీభవిస్తుండటం గమనార్హం. మొత్తానికైతే ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటీషన్ కోసం ఒక్క రోజే లక్ష సంతకాల అభిప్రాయ సేకరణ జరగడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యాఖ్యలను తప్పని తెలుసుకుని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో ట్రంప్ను యూకే లోకి అడుగుపెట్టనివ్వరాదని కొందరు పార్లమెంట్ నేతలు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement