రద్దీ రోడ్డుపై పోలీసుల దయ.. వీడియో అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

‘ఆ పోలీసులు నూరేళ్లు బతికేయాలి’

Published Tue, Jun 27 2017 4:13 PM

రద్దీ రోడ్డుపై పోలీసుల దయ.. వీడియో అదుర్స్‌ - Sakshi

కొలరాడో: కాస్త రోడ్డు దాటిస్తారా అని వేడుకుంటున్నా ఒక్కోసారి సమయం లేదని, బిజీగా ఉన్నామని ఏమి పట్టనట్లు వెళ్లిపోతున్న రోజులివి.. అలాంటిది రద్దీగా ఉండే రోడ్డు పైకి అనూహ్యంగా వచ్చిన ఓ రెండు పెద్ద బాతులు, వాటి పిల్లలను ఎంతో జాగ్రత్తగా తిరిగి రోడ్డు దాటించి సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా చేసి వావ్‌ అనిపించుకుంటున్నారు ఇప్పుడు అమెరికాలోని పోలీసులు. ఈ సంఘటన జూన్‌ 14న చోటు చేసుకుంది. అమెరికాలోని కొలరాడోలో గ్రీన్‌ వుడ్‌ అనే గ్రామం మీదుగా వెళుతున్న రద్దీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపైకి అనూహ్యంగా రెండు పెద్ద బాతులు తమ పిల్లలతో వచ్చేశాయి.

ఆ సమయంలో వాహనాలు వేగంగా వెళుతుండటంతో ఎటువెళ్లాలో అర్థం కాక రోడ్డుకు అటూఇటూ బిక్కుబిక్కుమంటూ పరుగెత్తడం మొదలుపెట్టాయి. ఇది చూసిన పెట్రోలింగ్‌ పోలీసు సిబ్బంది కాస్త ఏకంగా మూడు కార్లలో బయల్దేరి వాటికి ఎస్కార్ట్‌గా ఉండి ఒక పక్క నుంచి అవి ముందుకు కదిలి రోడ్డు దిగేలా నియంత్రణ చేస్తూ సురక్షితంగా తిరిగి గ్రామంలోకి పంపించారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా కూడా ఆ పోలీసులు చల్లగా ఉండాలంటూ దీవిస్తున్నారు. రోడ్‌ వేనే అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీయగా దానిని గ్రీన్‌ వుడ్‌ గ్రామానికి చెందిన అధికారులు తీసుకొని తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement