40 అడుగుల ఎత్తులో నుంచి సముద్రంలో పడి.. | Sakshi
Sakshi News home page

40 అడుగుల ఎత్తులో నుంచి సముద్రంలో పడి..

Published Tue, Mar 21 2017 10:01 AM

40 అడుగుల ఎత్తులో నుంచి సముద్రంలో పడి..

లండన్‌: సాధారణంగా ఓ పది అడుగుల ఎత్తునుంచి పడితేనే కాళ్లు విరిగే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటిది 40 అడుగుల ఎత్తునుంచి పడితే పరిస్థితి ఏమిటి? అయితే, ఇక్కడ పడింది మాత్రం వ్యక్తి కాదు.. ఓ ఆవు. అది కూడా గర్భంతో ఉన్న ఆవు. పార్క్‌ జాతికి చెందిన బ్రిటన్‌కు చెందిన ఆవు 40 అడుగుల ఎత్తులో ఉన్న ఓ కొండ మీద నుంచి పడిపోయింది. అక్కడ నుంచి సొంతంగా సముద్రం ద్వారా ఈదుకుంటూ నిర్మానుష్య ద్వీపానికి చేరుకుంది. ఇది గమనించిన కొంతమంది దానిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

శనివారం మధ్యాహ్నం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ ఆ ఆవు అటుఇటూ ఈదుతూ కదలడం, లైట్లు ఫెయిలవడం మూలంగా ఆ రోజు రక్షణ చర్యలు ఆపి మరుసటి రోజు ఉదయం దాదాపు తొమ్మిదిగంటలపాటు శ్రమించి తిరిగి దానిని పైకి తీసుకొచ్చారు. అంత ఎత్తుమీద నుంచి పడినా అదృష్టవశాత్తు దానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎప్పటి మాదిరిగా చక్కగా గడ్డి మేస్తూ ఆరోగ్యంగా కనిపించి దానిని రక్షించినవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌ ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీస్‌ సంస్థ ఆ ఆవును రక్షించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement