Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిజ్ఞ

Published Tue, Sep 12 2017 8:53 AM

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిజ్ఞ - Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాదుల స్వర్గధామాలు ప్రపంచంలో ఎక్కుడున్నా వాటిని నిర్మూలిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిజ్ఞ చేశారు. 9/11 దాడిలో చనిపోయిన దాదాపు 3 వేల మందికి అమెరికా సోమవారం ఘనంగా నివాళి అర్పించింది. 2001 సెప్టెంబరు 11న అల్‌కాయిదా ఉగ్రవాదులు అమెరికాలోని మూడు ప్రధాన కేంద్రాలపై చరిత్ర మరచిపోలేని రీతిలో దాడులు చేయడం తెలిసిందే. ట్రంప్, ఆయన భార్య మెలానియా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు.

అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని (అమెరికాను) భయపెట్టగలమని, మా స్ఫూర్తిని బలహీనపరచగలమని ఉగ్రవాదులు అనుకున్నారు. మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వారు మా చేతిలో ఓడిపోయిన శత్రువుల జాబితాలోకి చేరుతారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వేటాడతామ’ ని ట్రంప్‌ అన్నారు. అలాగే ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉంటూ అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సైనికులపై దాడులు చేస్తుండటంతో గత నెలలోనే ట్రంప్‌ పాక్‌కు కూడా గట్టి హెచ్చరికలు చేశారు.   
 

Advertisement
Advertisement