Sakshi News home page

నా ఇష్టంతోనే చేశాను..!

Published Wed, Oct 11 2017 4:11 PM

public fire against dove advertisement

న్యూఢిల్లీ : ’డవ్‌‘  సోప్‌ తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఈ యాడ్‌ జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మరికొందరైతే.. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ యాడ్‌లో నటించి బ్రిటీష్‌ - నైజీరియన్‌ మొడల్‌ లోలా ఒగ్నోమీ స్పందించారు. నేను ఇష్టపడే ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించాను.. నేను బాధితురాలిని కాను.. నేను మానసికంగా చాలా బలంగాను.. అందంగానూ ఉంటాను అని ఆమె ప్రకటించారు. ఈ యాడ్‌ అనేది కేవలం సంస్థ సృజనాత్మకదృష్టికి ప్రతీక మాత్రమే అని చెప్పారు. దీనిపై ఎవరూ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

యాడ్‌లో ఏముంది?
అంతర్జాతీయంగా జాతి వివక్షకు దారితీసేలా అడ్వర్టయిజ్‌మెంట్‌ ఉందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంతకూ యాడ్‌లో ఏముందన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. ఈ యాడ్‌ ఆరంభంలో ఒక నల్లటి అమ్మాయి.. డవ్‌ సోప్‌ వాడకముందు.. ఇలా ఉంది... వాడుతున్నాక.. ఇలా అంటూ.. నల్లటి అమ్మాయి టీ షీర్ట్‌ తీయగానే తెల్లగా మారుతుంది.

నెటిజన్ల ఆగ్రహం
డవ్‌ తాజాగా రూపొందించిన అడ్వర్టయిజ్‌మెంట్‌ పూర్తిగా జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. డవ్‌ సంస్థపై తమ ఆగ్రహాన్ని ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటిస్తున్నారు. ఇటువంటి అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement