రంగులు లాగేసే పెన్ను | Sakshi
Sakshi News home page

రంగులు లాగేసే పెన్ను

Published Thu, May 29 2014 12:41 AM

రంగులు లాగేసే పెన్ను - Sakshi

వాషింగ్టన్: రంగు పడుద్ది.. ఏ రంగు? మీకు కనబడిన ఏ రంగు అయినా సరే.. అది ఎక్కడ కనిపించినా సరే.. అసలు ఏ రంగో తెలియకపోయినా సరే.. మీకు నచ్చిన ఆ రంగునే వేసుకోవచ్చు, కాగితాలపై రాసుకోవచ్చు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక సరికొత్త పెన్నును తయారు చేశారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనో, వస్తువుల్లోనో మీకు నచ్చిన రంగు కనబడితే.. దానిని ఈ ‘స్క్రిబల్ ఇంక్ పెన్ను’ పెన్నుతో చిత్రీకరించి, అదే రంగులో రాసుకోవచ్చు.

పెన్నులో అమర్చిన కలర్ సెన్సార్.. కావాల్సిన రంగును గుర్తిస్తుంది. మైక్రో ప్రాసెసర్ ఆ రంగును విశ్లేషించి, మెమరీలో నిల్వ చేస్తుంది. కావాల్సినప్పుడు ‘స్క్రిబల్ ఇంక్ పెన్’ ఆ రంగును దానంతట అదే తయారు చేసుకుంటుంది. దాంతో ఎంచక్కా రాసుకోవచ్చు. యూఎస్‌బీ ద్వారా కంప్యూటర్‌కు, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి.. కావాల్సిన రంగులను వాటిలో ఉపయోగించుకోవచ్చు. దీని ధర.. సుమారు రూ. పదివేలు.
 

Advertisement
Advertisement