'తాలిబన్ చీఫ్తో పుతిన్ భేటీ అయ్యాడు' | Sakshi
Sakshi News home page

'తాలిబన్ చీఫ్తో పుతిన్ భేటీ అయ్యాడు'

Published Mon, Dec 28 2015 7:29 PM

'తాలిబన్ చీఫ్తో పుతిన్ భేటీ అయ్యాడు'

లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అఫ్ఘానిస్తాన్లోని ఓ తాలిబన్ కమాండెర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సౌర్తో గోప్యంగా సమావేశమైనట్టు ఇంగ్లండ్కు చెందిన ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరికట్టడానికి సాయం చేయాల్సిందిగా పుతిన్ తాలిబన్లను కోరినట్టు వెల్లడించాడు. గత సెప్టెంబర్లో తజకిస్థాన్లోని ఓ మిలటరీ స్థావరంలో ఓ రాత్రి పుతిన్..తాలిబన్ చీఫ్ను డిన్నర్ సమావేశానికి పిలిచారని చెప్పాడు.

సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులో ఉన్న అఫ్ఘానిస్తాన్లో ఐఎస్ ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తాలిబన్ కమాండర్ చెప్పాడు. ఐఎస్ కార్యకాలపాలను నిర్మూలించేందుకు సాయం చేస్తే తాలిబన్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆయుధాలు అందజేస్తామని రష్యా హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను తాలిబన్ తోసిపుచ్చింది. ఐఎస్ను ఎదుర్కోవడానికి రష్యాతో తమ ప్రతినిధులు సమావేశం కాలేదని తాలిబన్ చెప్పింది.


మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్లో రష్యా విమానం కూల్చివేత వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కుట్రదారుడని కేజీబీ (ఇప్పటి ఎఫ్‌ఎస్‌బీ) ఏజెంట్ బోరిస్ కార్పిఖోవ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను అమానుషులుగా ముద్ర వేసేందుకు, వారి అంతానికి పలు దేశాల సంఘీభావాన్ని కూడగట్టుకునేందుకు పుతిన్ ఈ దారుణ కుట్రకు తెర లేపారన్నది కార్పిఖోవ్ వాదన. అయితే ఈ వాదనలను రష్యా ఖండించింది. తాజాగా తాలిబన్ కమాండర్.. పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
Advertisement