అమ్మాయి కాదు... అబ్బాయే | Sakshi
Sakshi News home page

అమ్మాయి కాదు... అబ్బాయే

Published Thu, Jun 11 2015 8:37 AM

అమ్మాయి కాదు... అబ్బాయే

అదేమిటీ కుందనపు బొమ్మలా కనిపిస్తుంటే అమ్మాయి కాదంటారేమిటనుకుంటున్నారా. బొమ్మను చూసి దిమ్మ తిరిగితే అలానే అనిపిస్తుంది. అయితే వాస్తవం అది కాదు. విషయమేంటంటే కజఖిస్తాన్‌కు చెందిన అయాన్ ఝడేమోవ్ ప్రేమలో పడ్డాడు.  కళాశాలలో ప్రవేశంకోసం తన ప్రియురాలు... యూనిఫైడ్ నేషనల్ టెస్టింగ్ అనే పరీక్ష రాయాల్సి ఉన్నా నువ్వే రాయమంటూ అయాన్‌కు గోముగా చెప్పడంతో మనోడు కాస్తా తలూపేశాడు.

వైట్ బ్లౌస్, గ్రే స్కర్ట్ వేసుకుని, సింగారించుకుని, తిప్పుకుంటూ పరీక్ష హాలుకు చేరుకున్నాడు. అయితే ఎగ్జామినర్ గుండెలు తీసిన బంటు. విషయం రాబట్టేందుకు ప్రశ్నల వర్షం కురిపించడంతో గుట్టు రట్టయింది. ప్రియురాలి కళాశాల ప్రవేశం మరో ఏడాది వెనక్కిపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement