మన ఇంజినీర్ అమ్మాయికి రాణి ఆహ్వానం

25 Oct, 2015 20:12 IST|Sakshi

లండన్: భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2  రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు.

దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు.

మరిన్ని వార్తలు