మీడియా మేనేజర్‌ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం

22 May, 2019 08:38 IST|Sakshi

బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ : బ్రిటిష్‌ రాజ కుటుంబం భారీ వేతనంతో సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్ -2 ఉనికిని మరింత గొప్పగా  ఫోకస్‌  చేసే ఉద్దేశంతో ఈ జాబ్‌ను ఆఫర్‌ చేస్తోంది. సోషల్ మీడియా మేనేజర్ కావాలంటూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్‌ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ మేరకు కొత్తగా ఎంపిక కాబోయే మీడియా మేనేజర్‌  రాణిగారిని కొత్తగా సోషల్‌ మీడియాలో ప్రెజెంట్‌ చేయాల్సి వుంటుంది. అందుకు సంబంధించిన సరికొత్త మార్గాలను అన్వేషించాలి. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్ మీడియాలో  బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను  ఆకట్టుకువాలి. 

వేతనం :  30వేల  బ్రిటీష్ పౌండ్లు అంటే సుమారు రూ. 26,57,655 (26.5 లక్షలు).

పనిగంటలు: వారానికి 37.5 గంటలు (సోమవారం నుంచి  శుక్రవారం వరకు)

ఇతర ప్యాకేజీలు
జీతంలో 15 శాతం పెన్షన్ పథకం (6 నెలల తర్వాత). 33 రోజుల వార్షిక సెలవు (బ్యాంకు సెలవుతో కలిపి). ఉచిత భోజనం. దీంతోపాటు మీ  వృత్తిపరమైన నిరంతర అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం. 

అర్హతలు : డిగ్రీతోపాటు వెబ్‌సైట్‌లో పనిచేసిన అనుభవం,  అద్భుతమైన ప్లానింగ్‌ ఫోటోగ్రఫీ , వీడియో నైపుణ్యాలు  చాలా అవసరం.  ప్రాధాన్యతలను బట్టి  చురుకుగా స్పందించాలి. డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్‌ను  క్రియేట్‌ చేయాలి. లేటెస్ట్‌ డిజిటల్ కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్స్‌  మీద పూర్తిగా పట్టు వుండాలి. సృజనాత్మక నైపుణ్యం మెండుగా ఉండాలి.  డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతోపాటు, రైటింగ్‌, ఎడిటోరియల్‌ స్కిల్స్‌ ఉండాలి. డిజిటల్, సోషల్ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫాంలలో రోజువారీ వార్తా  విశేషాలను,  ఫీచర్ కథనాలను నిశితంగా గమనించాలి, పరిశోధించాలి. తద్వారా వివిధ ఆడియెన్స్‌ గ్రూపులను  మీడియా మేనేజర్‌గా ఆకర్షించాలన్నమాట.

>
మరిన్ని వార్తలు