విన్యాసాలు చేసే రోబో సైనికులు! | Sakshi
Sakshi News home page

విన్యాసాలు చేసే రోబో సైనికులు!

Published Tue, Aug 19 2014 3:26 AM

విన్యాసాలు చేసే రోబో సైనికులు!

వాషింగ్టన్: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా రోబో చూశారా? ఆ సినిమా క్లైమాక్స్‌లో రోబో చిట్టీ తనలాంటి వేలాది రోబోలను తయారు చేయడం, అవన్నీ కలసి గుమిగూడుతూ పెద్దపెద్ద ఆకారాల్లోకి మారిపోయి పెను విధ్వంసం సృష్టించడం అద్భుతంగా ఉంటుంది కదూ! అయితే.. చిత్రంలోని ఈ రోబోలు కూడా ఆ స్థాయిలో కాదుగానీ.. చిన్నచిన్న స్థాయిల్లో రకరకాల ఆకారాల్లోకి గుమిగూడగలవు. అలాగే విధ్వంసాలకు కాకుండా అనేక మంచి పనులకు తోడ్పడగలవు. కిలోబోట్స్ అని పిలిచే ఈ రోబోలను హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రాధికా నాగ్‌పాల్ బృందం రూపొందించింది.

మొత్తం 1,024 రోబోలను వీరు తయారు చేశారు. వీటిలో ఒక్కో రోబో ఒక పెద్దసైజు నాణెం అంత ఉంటుంది. మూడు కర్రపుల్లల్లాంటి కాళ్లతో ఉన్న ఈ ఒక్కో రోబో తయారీకి రూ.850 ఖర్చయిందట. పరారుణ సంకేతాలతో ఇవి సమాచారం పంపుకొంటూ ఒకదానితో ఒకటి కలసి పనిచేస్తాయి. ఇంతపెద్ద ఎత్తున రోబోల గుంపును సృష్టించడం, వాటన్నింటినీ ఇలా సమన్వయంతో పనిచేయిం చడం ఇదే తొలిసారట. వీటిని మరింత అభివృద్ధిపర్చితే రోబోలు పర్వతాలు ఎక్కేందుకు, సముద్రాల్లో ఈదేందుకు, ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.
 

Advertisement
Advertisement