Sakshi News home page

అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు

Published Thu, Jun 29 2017 4:40 PM

అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు - Sakshi

మాస్కో: అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. సిరియా మరోసారి రసాయిన దాడులు జరిపేలా అమెరికా తీవ్రంగా రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ రష్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా అన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా ఆమె స్పందించేందుకు నిరాకరించారు. సిరియా అధ్యక్షుడు అసద్‌ మరోసారి తమ దేశంలో అమాయకులపై రసాయినిక దాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని, అదే జరిగితే ఆయన పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో కావాలనే అమెరికా సిరియా అధ్యక్షుడు అసద్‌పై మరోసారి నిందలు వేసేందుకు రెచ్చగొడుతోందని, ఇప్పటికే ప్రపంచాన్ని నమ్మించేలాగా కెమికల్‌ దాడులకు సంబంధించిన ఫేక్‌ వీడియో ఒకటి తయారు చేసి సిద్ధంగా ఉంచినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. సిరియా కెమికల్‌ దాడులు చేసిన నేపథ్యంలో అమెరికా నేరుగా సిరియా ఎయిర్‌ బేస్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే, సిరియా అసలు రసాయన దాడులు దాడులు చేయలేదని, ఉగ్రవాదులపై యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బాంబులు నేరుగా కెమికల్‌ ఆయుధాలను ఢీకొట్టిన కారణంగా వెలువడిన వాయువులతోనే చనిపోయారని బసద్‌కు దన్నుగా నిలిచింది.

Advertisement
Advertisement