పోలింగ్ వద్దకు రావొద్దన్న అమెరికా.. రష్యా ఫైర్ | Sakshi
Sakshi News home page

పోలింగ్ వద్దకు రావొద్దన్న అమెరికా.. రష్యా ఫైర్

Published Tue, Nov 8 2016 7:01 PM

పోలింగ్ వద్దకు రావొద్దన్న అమెరికా.. రష్యా ఫైర్ - Sakshi

మాస్కో: అమెరికాపై రష్యా మండిపడింది. తమ దేశానికి చెందిన దౌత్య ప్రతినిధులను అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలను పరిశీలించకుండా అడ్డుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యంకాని చర్య అని పేర్కొంది. కాగా, మాస్కోలో ఉన్న అమెరికా రాయబారులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేశారు. మేం ఏ రష్యా ప్రతినిధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

తమ దేశ దౌత్య ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని అమెరికా అధికారులు ఇప్పటికే ఆదేశించారని, ఇది కొన్ని దేశాల్లో దౌత్య వేత్తలకు చేసే బెదిరింపు చర్యల మాదిరిగానే ఉన్నాయని, రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఫేస్బుక్లో పేర్కొన్నాడు. ఇక హ్యూస్టన్లో అయితే, ఏకంగా హాలీవుడ్ సినిమా పద్ధతిలో కట్టుదిట్టంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, తమ దేశ జనరల్ కాన్సులేట్ కు చెందిన అధికారి కారును నిలిపేసి మరి అడ్డుకున్నారని ఆరోపించారు. వీటినే అమెరికా కొట్టి పారేసింది.

Advertisement
Advertisement