హిల్లరీని మళ్లీ దెబ్బకొట్టాడు | Sakshi
Sakshi News home page

హిల్లరీని మళ్లీ దెబ్బకొట్టాడు

Published Wed, May 11 2016 8:36 AM

హిల్లరీని మళ్లీ దెబ్బకొట్టాడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ ఖరారు చేసుకోగా.. డెమొక్రటిక్ నామినీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం ఇంకా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆమెను అదే పార్టీకి చెందిన బెర్నీ సాండర్స్ గండం ఎదురవుతోంది. వెస్ట్ వర్జినీయాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ విజయం సాధించారు.

అంతకుముందు ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఆయన క్లింటన్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు రేసులో ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు వెళ్లినట్లవుతుంది. ఈ విజయం అనంతరం సాండర్స్ మాట్లాడుతూ మొత్తం 19 రాష్ట్రాల్లో తాము విజయం సాధించినట్లు చెప్పారు. దీంతో తాము అభ్యర్థిత్వ రేసులో సురక్షితంగా ఉన్నట్లయిందని, చివరి ఓటు వరకు తాను రేసులోనే ఉంటానని ఆయన చెప్పారు. అలాగే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ విజయం సాధించారు. వెస్ట్ వర్జినీయాలోని బొగ్గు మైనింగ్ వ్యవహారాలను ఎన్నికల ప్రచారంలో చెప్పడంలో హిల్లరీ క్లింటన్ విఫలమైనట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement