ఓ పావు కిలో చేపలు ఇవ్వు బాబూ! | Sakshi
Sakshi News home page

ఓ పావు కిలో చేపలు ఇవ్వు బాబూ!

Published Wed, Oct 29 2014 2:35 AM

ఓ పావు కిలో చేపలు ఇవ్వు బాబూ!

ఈక్వెడార్‌లోని శాంతా క్రజ్ ద్వీపం.. కొలంబియాకు చెందిన ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్ కాస్ట్రో సముద్ర తీరం వద్ద తిరుగుతూ ఫొటోలు తీసుకుంటున్నాడు. అంతలో అతడు ఎన్నడూ ఊహించని దృశ్యం కనిపించింది..
 
 ఒక సీలయన్ సముద్రంనుంచి బయటకొచ్చి.. తీరానికి సమీపంలో ఉన్న చేపలు అమ్మే దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే దుకాణం రష్‌గా ఉంది. చాలా మంది తమ వంతు కోసం వేచిఉన్నారు. ఆ సీలయన్ కూడా ఓపిగ్గా క్యూ కట్టింది. దాదాపు గంటపాటు తమ వంతు కోసం వేచి చూసింది. చివరకు తన వంతు రాగానే.. చేపలమ్మే వ్యక్తి వేసిన ముక్కలు నోట కరుచుకుని, లొట్టలేస్తూ.. తాపీగా సముద్రంలోకి తిరిగి వెళ్లిపోయింది.
 
 కాస్ట్రోకు ఇది కొత్త విషయం గానీ.. అక్కడోళ్లకు కామన్ అట. ఆ సీలయన్ తరచూ ఇలా వస్తుందట. వీళ్లు కూడా దాన్నేమీ అనరు. తాకడానికి ప్రయత్నించరు. దీంతో అది కూడా మనుషులంటే భయపడకుండా ఎంచక్కా వచ్చేస్తుందట.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement