ఈ భారి సైబర్ దాడి వెనుక నార్త్ కొరియా? | Sakshi
Sakshi News home page

ఈ భారి సైబర్ దాడి వెనుక నార్త్ కొరియా?

Published Tue, May 16 2017 12:39 PM

ఈ భారి సైబర్ దాడి వెనుక నార్త్ కొరియా?

వాషింగ్టన్ : ఇంటర్నెట్ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది వన్నాక్రై సైబర్ దాడి.  ఐదు రోజుల కిందట జరిగిన ఈ దాడితో ప్రపంచమంతా వణికిపోయింది. రాన్సమ్ వేర్ వైరస్ ను ఉపయోగించి ఈ అనూహ్య దాడికి పాల్పడిందో  ఎవరో కనుగోవడంలో ప్రస్తుతం సెక్యురిటీ సంస్థలన్నీ నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ భారీ సైబర్ అటాక్ వెనుక నార్త్ కొరియా ఉన్నట్టు సెక్యురిటీ రీసెర్చర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న రష్యా, అమెరికాల మధ్య తాజాగా మరో రాజకీయ యుద్ధం సృష్టించడానికి  ఉత్తరకొరియా ఈ పన్నాగం పన్నినట్టు వారు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం ఈ వన్నాక్రై సైబర్ అటాక్ ముప్పు కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికే 3,00,000 కంప్యూటర్లు హ్యాకైనట్టు టాప్ అమెరికా అధికారి చెప్పారు.
 
బీభత్సం సృష్టించిన ఈ వన్నాక్రై సైబర్ దాడికి, విస్తృతంగా హ్యాకింగ్ కు ప్రయత్నించే ప్యోంగ్యాంగ్ కు సంబంధమున్నట్టు  ఓ గూగుల్ రీసెర్చర్ కంప్యూటర్ కోడ్ ను పోస్టు చేశాడు. ఇతర రీసెర్చర్లు కూడా కచ్చితంగా ఈ కుట్ర వెనుక ఉన్నది నార్త్ కొరియానేనని చెబుతున్నారు. ఇజ్రాయిల్ కు చెందిన ఓ సెక్యురిటీ సంస్థ ఇంటెజర్ ల్యాబ్స్ కూడా నార్త్ కొరియాకే ఈ చర్యను ఆపాదించింది. ఇప్పటికే ఖండాతర క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను ఆందోళన పెడుతున్న ఈ దేశం ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
 
అమెరికా-నార్త్ కొరియాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ దాడికి కారణం అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిన టూల్సేనని  దాడికి వెలుగులోకి వచ్చిన రోజు అగ్రరాజ్యాన్ని తిట్టిపోశారు. కానీ రాన్సమ్ డేటా కలిగి ఉన్న టూల్ ను ఎన్ఎస్ఏ రూపొందించలేదని,  ఇది గ్లోబల్ ఎటాకేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాప్ సైబర్, హోమ్ ల్యాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ టామ్ బాస్స్టర్ చెప్పారు. 
 

Advertisement
Advertisement