స్మార్ట్‌ఫోన్ కవరే.. ఫొటో ప్రింటర్! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ కవరే.. ఫొటో ప్రింటర్!

Published Wed, Nov 19 2014 12:39 AM

స్మార్ట్‌ఫోన్ కవరే.. ఫొటో ప్రింటర్! - Sakshi

 సెల్ఫీలను, ఫొటోలను అప్పటికప్పుడే ముద్రించుకునేందుకు ఉపయోగపడే వినూత్న స్మార్ట్‌ఫోన్ కేస్‌ను ఫ్రెంచ్ కంపెనీ ‘ప్రింట్’ తయారు చేసింది. అంతర్గతంగా ప్రింటర్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ కేస్ బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు అనుసంధానమై ఎంపిక చేసుకున్న ఫొటోలను 50 సెకన్లలోనే ప్రింట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కేస్ ప్రింటర్‌లో ఒకసారి ఒక కాగితం మాత్రమే పెట్టేందుకు వీలవుతుంది.

భవిష్యత్తులో ఒకేసారి 30 కాగితాలు పట్టేలా, 30 సెకన్లలోనే ఒక ఫొటోను ప్రింట్ చేసేలా దీనిని అభివృద్ధిపరుస్తున్నారు. వచ్చే జనవరిలో దీనిని విడుదల చేయనున్నారట. ధర సుమారు రూ. 6,100 ఉండవచ్చని చెబుతున్నారు.
 

 

Advertisement
Advertisement