సౌరశక్తితో నడిచే విమానం వచ్చేసిందోచ్ | Sakshi
Sakshi News home page

సౌరశక్తితో నడిచే విమానం వచ్చేసిందోచ్

Published Mon, Jun 2 2014 6:56 PM

సౌరశక్తితో నడిచే విమానం వచ్చేసిందోచ్ - Sakshi

విమానయాన రంగంలో ఇదో సరికొత్త ఆవిష్కరణ. సౌరశక్తితో నడిచే విమానాన్ని విజయవంతంగా ప్రయోగించారు. స్విట్జర్లాండ్లో సోమవారం ఈ ప్రయోగం నిర్వహించారు. సోలార్ పవర్డ్ విమానం రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది ఈ విమానం ద్వారా ప్రపంచమంతా చుట్టి రావాలని ప్రయత్నిస్తున్నారు.

ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం సౌరశక్తితోనే ఈ విమానం ప్రయాణించడం విశేషం. కాగా ఇందులో ఒక్కరు ప్రయాణించేందుకే వీలవుతుంది. ఫైలట్ మార్కస్ ష్కెర్డెల్ రెండు గంటలా 17 నిమిషాల పాటు విమానం నడిపారు. ఈ ప్రయోగం స్ఫూర్థితో రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు తయారు చేయవచ్చని భావిస్తున్నారు. 'ఈ విమానం ఆవిష్కరణ ముఖ్యమైన దశ. ప్రపంచమంతటా తిరిగి రావడానికి మరో అడుగు ముందుకేశాం. మా భాగస్వాములు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు' సోలార్ ఇంపల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, పైలట్ బోర్స్బర్గ్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement