Sakshi News home page

మెజార్టీ మార్క్ దాటి క్లీన్ స్వీప్ దిశగా..

Published Fri, Nov 13 2015 5:30 PM

మెజార్టీ మార్క్ దాటి క్లీన్ స్వీప్ దిశగా..

యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డీ పార్టీ పూర్తి మెజార్జీని సాధించింది. దిగువ సభ, ఎగువ సభ కలిపి 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 329 మెజార్టీ మార్క్ను దాటింది. ఎన్‌ఎల్‌డీ మెజార్టీకి అదనంగా మరో 21 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.

శుక్రవారం వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఎన్‌ఎల్‌డీ దిగువ సభలో  238, ఎగువ సభలో 112 సీట్లను సాధించింది. ఇక రాష్ట్రాల్లో 401 సీట్లు గెల్చుకుంది. అధికార యూఎస్డీపీ మొత్తమ్మీద 102  సీట్లనే మాత్రమే నెగ్గింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడాల్సివుంది. దశాబ్దాల సైనిక పాలనకు చరమగీతం పలికిన మయన్మార్ ప్రజలు సూచీకి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెడుతున్నారు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో 75 శాతం సీట్లకే ఎన్నికలు నిర్వహిస్తారు. మరో 25 శాతం స్థానాలకు ఎన్నికలు లేకుండా మిలటరీ ఎంపిక చేస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement