సిడ్నీలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు.. | Sakshi
Sakshi News home page

సిడ్నీలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు..

Published Wed, Feb 11 2015 9:27 AM

Sydney men arrested over beheading plot

సిడ్నీ: సిడ్నీ పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మంగళవారం అరెస్టు చేశారు. వారికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుతో సంబంధాలున్నాయనే ఆరోపణల కారణంగా నిర్బంధంలోకి తీసుకున్నట్టు న్యూ సౌత్ వేల్స్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేథరిన్ బర్న్ బుధవారం తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నట్టు బర్న్ చెప్పారు. వారిని అరెస్టు చేయకపోతే కచ్చితంగా దాడులు చేసేవారని ఆయన పేర్కొన్నారు.

అరెస్టు అయిన వ్యక్తులు ఐఎస్ గ్రూపుకు సమాచారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వారు దాగి ఉన్న ప్రదేశంలో పరిశీలించగా అక్కడ.. వేటకొడవలి లభ్యమైనట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దాడుల గురించి వారి దగ్గర నుంచి వీడియో రూపంలో ఆధారాలను సేకరించామని చెప్పారు. అరెస్టయిన ఆ ఇద్దరు పశ్చిమ సిడ్నీలో బుధవారం దాడులు చేయాలనుకున్నట్టు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement