బాల్కనీలో నుంచి మహిళ ఒళ్లో పడి.. | Sakshi
Sakshi News home page

బాల్కనీలో నుంచి మహిళ ఒళ్లో పడి..

Published Fri, Jun 3 2016 3:20 PM

బాల్కనీలో నుంచి మహిళ ఒళ్లో పడి.. - Sakshi

బ్లాక్ పూల్: గ్రీసులో ఓ యువకుడు థియేటర్ బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా వచ్చి కింద వరుసలో కూర్చున్న ఓ మహిళ భుజంపై నేరుగా పడ్డాడు. చాలా ఎత్తులో నుంచి పడటంవల్ల గాయాలు అవడంతో అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గ్రీసు దేశంలోని బ్లాక్ పూల్ లో గ్రాండ్ థియేటర్ అని ఒక ప్రదర్శన హాలు ఉంది. ఇందులో ప్రతి రోజు ఏదో ఒక కళకు చెందిన ప్రదర్శన ఉంటుంది. ఇందులో రెండు మూడు స్థాయిల్లో బాల్కనీలు ఉన్నాయి. ఈ షోకు వచ్చిన పద్దినిమేదేళ్ల యువకుడు రాత్రి 9.30గంటల ప్రాంతంలో నేరుగా బాల్కనీ పై నుంచి ఓ మృతదేహం మాదిరిగా పడ్డాడు.

అదే సమయంలో చివరి వరుసలో ఉన్న ఓ మహిళపై పడ్డాడు. అయితే, ఆమెకు ఎలాంటిగాయాలు కాలేదు. అతడ్ని మాత్రం రాయల్ ప్రెస్టాన్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఒకరు ట్విట్టర్ లో స్పందిస్తూ 'ఇలాంటి సంఘటనకు తాను సాక్షినవుతానని ఎప్పుడూ ఊహించుకోలేదు. అంత ఎత్తు నుంచి శవం మాదిరిగా ఓ మహిళపై పడ్డాడు. ఆ సమయంలో నేను నా పన్నేండేళ్ల కుమారుడితో కూర్చొని ఉన్న. ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు' అని బదులిచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రదర్శనను నిలిపేశారు.

Advertisement
Advertisement