హెచ్‌1బీల్లో మోసానికి పాల్పడ్డ తెలుగు వ్యక్తి | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీల్లో మోసానికి పాల్పడ్డ తెలుగు వ్యక్తి

Published Sun, Dec 18 2016 6:51 AM

telugu person involved in H1B visa Cheating

వాషింగ్టన్ : హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో హెచ్‌1బీ వీసా మోసాలకు పాల్పడ్డాడు. ఓ ఐటీ కంపెనీలో ఇమ్మిగ్రేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న కర్నె హరి (32) తాను మోసాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో హరి దోషిగా తేలితే అతనికి ఐదేళ్ల వరకూ జైలుశిక్షతో పాటు రూ. 1.70 కోట్ల జరిమానా విధించే వీలుంది. న్యాయవాదుల సమాచారం మేరకు.. అమెరికాలో పనిచేయాలనుకునే వారిని ‘ఐటీ నిపుణులు’గా పేర్కొంటూ హరి రిక్రూట్‌చేసుకుంటాడు. వీరిని అమెరికాలో ‘ఎస్‌సీఎం డాటా’, ‘ఎంఎంసీ సిస్టమ్స్‌’ సంస్థల్లో అమెరికాలో పనిచేయబోతున్నట్లు హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేస్తారు.

వార్షికవేతనం పొందేవాళ్లకే హెచ్‌1బీ వీసాలిస్తారు కాబట్టి వీరిని ఫుల్‌టైమ్‌ వర్కర్లగా సంబంధిత పత్రాల్లో చూపిస్తారు. ఇలా అక్రమపద్దతిలో అమెరికాకు వెళ్లిన వారు పొందే వేతనాన్ని కంపెనీలకే తిరిగి ఇచ్చేలా వారితో హరి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ సంస్థల్లో నకిలీ సెలవు లేఖలు సృష్టించేందుకు హరి సాయపడ్డాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement