‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’ | Sakshi
Sakshi News home page

మోహిని పిశాచికి విరుగుడు.. అందుకే బతికున్నారంట!

Published Sat, Mar 3 2018 2:28 PM

Thailand Village Woman Try To Save Their Males - Sakshi

బ్యాంకాక్‌ :ఓ స్త్రీ రేపు రా’.. కొన్నేళ్ల క్రితం దెయ్యాల భయంతో మన దేశంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్మే థాయ్‌లాండ్‌లోని ఓ గ్రామంలో ఇప్పుడీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ ఇంట్లో మగాళ్లు మోహిని పిశాచి మూలంగా చనిపోతుండటంతో వింత పద్ధతులకు దిగారు. ఇంతకీ కథేంటో తెలియాంటే నాఖోన్‌ ఫానోమ్‌ గ్రామానికి ఒక్కసారి వెళ్దాం.

ఈశాన్య థాయ్‌లాండ్‌కు సుదూర దూరంలో ఉన్న ఆ గ్రామంలో రాత్రయ్యిందంటే చాలూ మగాళ్లు.. మహిళల మాదిరి సింగారించుకుని పడుకుంటారు.  ఇళ్ల ముందు దిష్టి బొమ్మలు, బోర్డులపై రాతలు దర్శనమిస్తాయి. అవి సాధారణంగా ఉంటే చర్చనీయాంశంగా ఎందుకు మారుతాయి?. దిష్టి బొమ్మలకు దుంగలతో పెద్ద పురుషాంగం మాదిరి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక బోర్డులపై ‘మా ఇంట్లో మగవాళ్లు లేరు’ అన్న రాతలు దర్శనమిస్తున్నాయి.  

కొన్నాళ్ల క్రితం ఆ ఊళ్లో ఓ వితంతువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పురుషులు విచిత్రంగా ప్రాణాలు విడుస్తున్నారు. నిద్రలో పడుకున్న వాళ్లు.. పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోతున్నారు.  దీంతో ఆ మహిళ మోహిని పిశాచంలా మారి తమ ఇంట్లో మగాళ్లను బలితీసుకుంటూ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ ఊరి మహిళలు నమ్మసాగారు. వారంతా కలిసి కొందరు తాంత్రిక పెద్దలను కలిశారు. వారి సలహా మేరకు ఆ పిశాచి నుంచి మగాళ్లను రక్షించుకోవడానికి ఈ పద్ధతులను అవలంభిస్తున్నారు.

అంత పెద్ద మర్మాంగం చూస్తే ఆ ఇంట్లోకి వచ్చేందుకు దెయ్యం వణికిపోతుందని.. ఒకవేళ తెగించి వచ్చినా మహిళల రూపంలో ఉన్న మగాళ్లని చూసి వెళ్లిపోతుందనే ఆ పని చేశారంట. అయితే ఈ పద్ధతులు పాటిస్తున్నాకే తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని అక్కడివారు చెబుతున్నారంట. అలాంటప్పుడు తాము ఎంత చెప్పినా ఏం లాభమని హేతువాదులు, వైద్యులు అంటున్నారు.

Advertisement
Advertisement