రహదారి లేని నగరం.. | Sakshi
Sakshi News home page

రహదారి లేని నగరం..

Published Sun, Aug 17 2014 12:35 AM

రహదారి లేని నగరం..

అవును.. ఈ నగరానికి వెళ్లాలంటే రహదారి లేదు. పెరూలోని ఇక్విటోస్ నగరానికి వెళ్లాలంటే జలమార్గం, వాయు మార్గమే గతి.. మరో మార్గం లేదు. దీనికి ఓవైపు అమెజాన్ నది ఉంటే.. మిగిలిన వైపంతా అమెజాన్ అడవే. ఇక్కడికి బోటులో వెళ్లాలంటే.. వారం రోజులు పడుతుంది. ప్రపంచంలో రోడ్డు సౌకర్యం ద్వారా చేరుకోలేని అతి పెద్ద నగరం కూడా ఇక్విటోస్‌నే.

జనాభా నాలుగున్నర లక్షల మంది. ఒకప్పుడు ఇక్కడ రబ్బరు పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. 1912 తర్వాత రబ్బరు ఉత్పత్తి తగ్గడంతో దీనిపై ఆధారపడి జీవించేవారూ తగ్గారు. ఇక్విటోస్‌కు పర్యాటకుల తాకిడీ ఎక్కువే. చుట్టూ అమెజాన్ అడవి ఉండటంతో వారీ నగరానికి ఎక్కువగా వస్తుంటారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement