ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలు.. | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలు..

Published Fri, May 6 2016 11:16 PM

ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలు..

తాజాగా విడుదైలైన టాప్ విశ్వవిద్యాలయాల జాబితాలో బ్రిటన్, అమెరికాకు చెందిన యూనివర్సిటీల హవా కొనసాగింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన 10వేల మంది స్కాలర్ల నుంచి తీసుకున్న ఒపీనియన్ పోల్స్ ఆధారంగా టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. టాప్ 10 జాబితాలో 8 స్థానాలను అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, మిగతా రెండింటిలో బ్రిటన్కు చెందిన యూనివర్సిటీలు ఉన్నాయి.
 
2015-16 ఏడాదికి గానూ టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన టాప్ 10 యూనివర్సిటీలు
1. హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్
2. మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్
3. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్
4. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే
5. యనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే
6. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లే, యూఎస్
7. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూఎస్
8. యేల్ యూనివర్సిటీ, యూఎస్
9. కొలంబియా యూనివర్సిటీ, యూఎస్
10. కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్

టాప్ 100 యూనివర్సిటీలలో 43 అమెరికాకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది. హార్వర్డ్ తన మొదటి స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటే, ఎంఐటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు ర్యాంకుల జాబితాలో కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీలను అధిగమించాయి. టాప్ 10లో  మిగతావి గత ర్యాంకులలో మాదిరిగా తమపాత స్థానాల్లోనే అలానే కొనసాగాయి.  

గత ర్యాంకుల జాబితాల్లో టాప్10లో నిలిచిన ఆసియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఈ జాబితాలో 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆసియాకు చెందిన 18 యూనివర్సిటీలు టాప్ 100 జాబితాలో చోటు సంపాదించగా, భారత్కు చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.

Advertisement
Advertisement