అమెరికాలో సిక్కు యువకుడి హత్య | Sakshi
Sakshi News home page

అమెరికాలో సిక్కు యువకుడి హత్య

Published Sun, Sep 3 2017 1:32 AM

The murder of a Sikh man in America

వాషింగ్టన్‌ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విశ్వవిద్యాలయంలో సీటు రాలేదన్న ఆగ్రహంతో ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌ గగన్‌దీప్‌సింగ్‌(23)ను అమెరికన్‌ విద్యార్థి జాకబ్‌ కోలెమన్‌(19) కత్తితో పొడిచి చంపాడు. గగన్‌ అమెరికాలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతూ, ట్యాక్సీ నడిపేవాడు. జాకబ్‌ స్పోకన్‌లోని గోన్జగా వర్సిటీలో ప్రవేశం కోసం వచ్చాడు.

‘తన ప్రవేశాన్ని అధికారులు తిరస్కరించడంతో ఆవేశానికి లోనైన జాకబ్‌ హత్య చేయాలనుకున్నాడు. వెంటనే దగ్గర్లోని ఓ షాపుకెళ్లి కత్తి కొన్నాడు. తర్వాత గగన్‌ నడుపుతున్న ట్యాక్సీ ఎక్కి, బొన్నెర్‌ కౌంటీలోని తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లాలని జాకబ్‌ చెప్పాడు. కొంతదూరం ప్రయాణించాక తాను తప్పుడు మార్గంలో వెళుతున్నట్లు గుర్తించిన గగన్‌ కూటెనై పట్టణంలో ట్యాక్సీని ఆపాడు. వెంటనే జాకబ్‌ గగన్‌ను పలుమార్లు కత్తితో పొడిచి హతమార్చాడు’ అని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement