ఎటు చూసినా ట్రంపే! | Sakshi
Sakshi News home page

ఎటు చూసినా ట్రంపే!

Published Sat, Aug 6 2016 2:48 AM

ఎటు చూసినా ట్రంపే! - Sakshi

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తలపై జుట్టు... నార్వేలో పెరిగే ఒక రకం గడ్డిని పోలి ఉంటుందని ఆ మధ్య ఎవరో ట్రంప్ ఫొటోను, గడ్డి ఫొటోను పక్కపక్కన పెట్టి నెట్‌లోకి తోసేశారు. నిన్నమొన్న అమెరికాలో మూడు రకాల పెండెంట్ లు మార్కెట్‌లోకి వచ్చాయి.

పిల్లుల (క్యాట్స్) వెనుకభాగంలో కట్టడం కోసమే తయారైన ఆ పెండెంట్‌లలో మూడు రకాల హావభావాలతో ట్రంప్ ముఖచిత్రం ఉంటుంది! ఇప్పుడిక తాజాగా ఇంగ్లండులోని హియర్‌ఫోర్డ్‌షైర్‌లో దారి పక్కన ఉండే ఓ రంపపు ఆకుల చెట్టు (ఎల్మ్) అచ్చు ట్రంప్ ముఖంలా ఉందని బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జోన్ రోలీ ఓ ఫొటోను విడుదల చేశారు. అమెరికా ఎన్నికలు అయ్యేలోపు ట్రంప్‌ను మనం ఎన్నివిధాలుగా చూడాలో! ఎన్ని విధాలుగా చూసినా పర్వాలేదు, అమెరికా అధ్యక్షుడిగా మాత్రం చూడకూడదని మీరు గానీ అనుకోవడం లేదు కదా!

Advertisement
Advertisement