'లా' చదవడానికి బెస్ట్ యూనివర్సిటీలివే.. | Sakshi
Sakshi News home page

'లా' చదవడానికి బెస్ట్ యూనివర్సిటీలివే..

Published Sat, Dec 24 2016 5:21 PM

'లా' చదవడానికి బెస్ట్ యూనివర్సిటీలివే..

లండన్:
ప్రపంచవ్యాప్తంగా న్యాయ వృత్తికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. లా చదవడం ఒక ఎత్తైతే అందుకు తగ్గా ఉద్యోగాన్ని సాధించడం మరో సవాలుగా మారింది. టాప్ యూనివర్సిటీల్లో లా పట్టా తీసుకొని కెరీర్లో సెట్ అవ్వాలని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో మెరుగైన విద్యా ప్రమాణాలతో లా డిగ్రీని అందిస్తున్న టాప్ యూనివర్సిటీలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వివిధ ప్రామాణికాల ఆధారంగా ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న యూరోప్ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టిన క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) తాజాగా సర్వే చేసింది. 2016-17కు సంబంధించి విడుదల చేసిన యూరోప్ టాప్ లా యూనివర్సిటీలు..

యూరోప్ లోని టాప్ లా యూనివర్సిటీలు..అవరోహణ క్రమంలో(బ్రాకెట్ లో గ్లోబల్ ర్యాంకులు, పక్కనే క్యూఎస్ ఇచ్చిన మార్కులు)
13 యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ (41)- 71.7
13 దర్హమ్ యూనివర్సిటీ  (41) -71.7
11 రుప్రెచ్ట్ కార్ల్స్ యూనివర్సిటాట్ హిడెల్ బెర్గ్ (39)- 72.3
10 క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ (35) -73.4
9 కతోలికె యూనివర్సిటీట్ లీవెన్ (33) -73.6
8 యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ (28) -77.1
7 లీడెన్ యూనివర్సిటీ(24)- 77.6
6 యూనివర్సిటీ పారిస్ 1 పాంథియన్-సోర్బోన్నె(20)- 78.6
5 కింగ్స్ కాలేజ్ లండన్(17) -80.5
4 యూనివర్సిటీ కాలేజ్ లండన్(14)- 83.4
3 లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (7)- 90.1
2 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (3)- 96.0
1 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ (2)- 96.7

ఆరు ప్రామాణికాల ఆధారంగా ర్యాంకులు
క్యూఎస్.. యూనివర్సిటీలు/విద్యా సంస్థలకు ర్యాంకులిచ్చే క్రమంలో ఆరు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంది. అవి..
 
 1)సంబంధిత విద్యా సంస్థకు అకడమిక్‌గా ఉన్న గుర్తింపు
 2)ఉద్యోగ నియామక సంస్థల గుర్తింపు
 3)ఫ్యాకల్టీ - విద్యార్థి నిష్పత్తి
 4)అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తి
 5)అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి
 6)ఫ్యాకల్టీ సైటేషన్స్

Advertisement
Advertisement