భార్యతో కంటే జైల్లోనే సేఫ్ అని... | Sakshi
Sakshi News home page

భార్యతో కంటే జైల్లోనే సేఫ్ అని...

Published Sat, Sep 10 2016 1:55 PM

This Man Would Rather Be in Jail Than at Home with His Wife

వాషింగ్టన్ః దొంగలెవరైనా దోపిడీలకు పాల్పడి, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ దొంగ మాత్రం అలా చేయలేదు. నేను దోపిడీకి పాల్పడ్డాను అరెస్టు చేయడంటూ స్వయంగా పోలీసులకు చిక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతకూ ఆ సిన్సియర్ దొంగ కథను తరచి చూస్తే... ఇంట్లో పెళ్ళాం పెట్టే బాధలుకన్నా జైల్లో గడపడమే బెటర్ అనుకున్నాడట. అందుకే బ్యాంకు దోపిడీకి యత్నించానని చెప్పుకొచ్చాడు.

అమెరికా ముస్సోరి రాష్ట్రంలోని కన్సాస్ నగరంలో 70 ఏళ్ళ లారెన్స్ జాన్ రిప్పల్.. తనవద్ద గన్ ఉందని సిబ్బందిని భయపెట్టి బ్యాంకు దోపిడీకి యత్నించాడు. అయితే దోచుకున్నవాడు అక్కడినుంచీ ఎస్కేప్ అవ్వకుండా తీరిగ్గా బ్యాంకు లాబీలో ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు కూర్చున్నాడు. సెక్యూరిటీ ప్రశ్నించినా అదే చెప్పాడు. అయితే జరిగిన ఘటనపై బ్యాంకు సిబ్బంది సెక్యూరిటీకి తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. రిప్పల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో రిప్పల్ చెప్పిన విషయాలు పోలీసులతోపాటు, కోర్టు సిబ్బంని విస్తుపోయేలా చేశాయి.

రోజంతా తన భార్యతో పడేకంటే జైల్లో ఉండటం బెటర్ అనుకున్నానని, అందుకే ఈ చోరీకి పాల్పడ్డానని రిప్పల్ కోర్టుకు వివరించాడట. అంతేకాక తన భార్య ముందు రాసిన డిమాండ్ నోట్ లో కూడా.. ఇంట్లోకంటే జైల్లో ఉండటమే బాగుంటుందని పేర్కొన్నాడు. తన తరపున వాదించేందుకు న్యాయవాది కూడా అవసరం లేదని, తాను ఎలాగైనా ఇంటినుంచీ బయట పడి  జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని రిప్పల్ కోర్టు డాక్యుమెంట్లలో స్పష్టంగా  వివరించాడు. కాగా  రిప్పల్ ఫేస్ బుక్ పేజీ చూసిన వారికి మాత్రం అసలేం జరిగిందో అర్థం కావడం లేదు. తన భార్యతో ఎంతో ప్రేమగా తీయించుకున్న ఫోటోను రిప్పల్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాక, ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవడం వింతగా కనిపించింది. ఫోటో చూసిన తర్వాత రిప్పల్ దంపతుల అసలు కథ ఏమై ఉంటుందా అని లోతుగా విశ్లేషించాల్సివస్తోంది.

Advertisement
Advertisement