బిగ్ డేటా మాంత్రికుడు..! | Sakshi
Sakshi News home page

బిగ్ డేటా మాంత్రికుడు..!

Published Sat, May 7 2016 6:36 PM

బిగ్ డేటా మాంత్రికుడు..!

బెంగళూరు: అసలు ఈ సాఫ్ట్ వేర్ ప్రపంచంలో అత్యంత వేగంగా వంద మిలియన్ డాలర్లకు చేరుకున్న ఏదైనా కంపెనీ ఉందా? అంటే అది సిలికాన్ వ్యాలీలో ఉన్న హోర్టాన్ వర్క్స్ కు మాత్రమే సాధ్యమైన విషయం. మరి ఈ కంపెనీ విజయం వెనుక ఎవరున్నారో తెలుసా..? ఆయనే అరుణ్ మూర్తి.


2011లో ప్రారంభించిన హోర్టాన్ వర్క్స్ నాలుగేళ్లలో ఈ స్థాయికి వచ్చిందంటే అందుకు కారణం మూర్తి అపార అనుభవమే. బార్ క్లేస్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2014లో తొలిసారి ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ విలువ తర్వాత మెల్లగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో వచ్చిన మార్పులకు కారణంగా షేర్ల విలువలు మళ్లీ భారీగా పెరిగాయి.


పదేళ్ల వయసులో కోడింగ్ రాయడం ప్రారంభించిన మూర్తి.. మామూలు చెస్ కంటే కష్టతరంగా ఉండేలా ఒక చెస్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. ఆట పూర్తిచేసేందుకు గంటల సమయాన్ని కంప్యూటర్ ముందు వెచ్చిస్తారు. తాను 17ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ మ్యాగజైన్లలో వచ్చిన ఆర్టికల్స్ ను చదివి ఎలక్ట్రానిక్ సిటీలో వస్తువులు కొని కంప్యూటర్లు తయారుచేసి స్నేహితులకు విక్రయించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్న మూర్తి బెంగళూరులో ఉంటున్న తల్లిని చూసేందుకు వచ్చారు. నగరంలోని ఆర్ వీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పూర్తిచేసిన మూర్తి యాహూ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం పొందారు. అక్కడనుంచి మెల్లగా హడూప్ సాఫ్ట్ వేర్ ను ఆయన డెవలప్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన బిగ్ డేటా అనాలసిస్ ను రూపొందించింది కూడా అరుణ్ మూర్తే.

హడూప్ ను తయారుచేసే క్రమంలో తాను 0.578 టెరాబైట్ల వేగంతో డేటా ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేయగలిగినట్లు ఆయన తెలిపారు. 2011లో యాహూ నుంచి బయటకు వచ్చిన హడూప్ టీమ్ అదే ఏడాది హోర్టాన్ వర్క్స్ ను ప్రారంభించింది. యాహో కో-ఫౌండర్ ను కలిసిన మూర్తి తొలి పెట్టుబడులను ఆయన నుంచే రప్పించగలిగారు. 2014లో మూర్తిని ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 20 డేటా అనలిస్ట్ల్లో ఒకరిగా పేర్కొంది. హడూప్ కోసం తాను తయారుచేసిన యార్న్ ఆపరేటింగ్ సిస్టంను తన కొడుకుగా అరుణ్ మూర్తి పేర్కొన్నారు.

Advertisement
Advertisement