ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత | Sakshi
Sakshi News home page

ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత

Published Sat, Jul 22 2017 11:30 AM

ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత - Sakshi

న్యూఢిల్లీ: ఆగస్టు21న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. అమెరికాఖండంలోని 14 రాష్ట్రాల్లో ఏర్పడనుందని  నాసా ప్రకటించింది. 2017 ఆగస్టు 21 న  సంభవించే ఇది చాలా అరుదైన గ్రహణమనీ, ఖగోళ అద్భుతం మని నాసా అభివర్ణించింది.    మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాలలో ఇది మొదటిదని పేర్కొంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమి​కి మధ్యనుంచి చంద్రుడు దాటుడూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో  ఆకాశంలో సూర్యుడు కనిపించడని  పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగే అవకాశం ఉందని చెప్పింది.

ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ ఈవెంట్‌ను దాదాపు 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది  వీక్షించనున్నారని నాసా  అంచనా వేసింది. అలాగే ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రా ప్రమాణాలను పాటించాలని నాసా   సిఫారసు  చేసింది. ముఖ్యంగా ఎక్లిప్‌  గ్లాసెస్ లేదా హ్యాండ్‌ హెల్డ్‌ సోలార్ వ్యూయర్ లాంటి ప్రత్యేక ప్రయోజన సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది.

మరోవైపు ఈ గ్రహణం కారణంగా  ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం  సూర్యుడు మాయం కానున్నాడు.  గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్  అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్‌లాండ్‌ నుంచి ఓరెగాన్‌ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది.  రెండు నిమిషాల కొన్నిసెకన్లపాటు ఆకాశంలో చుక్కలు  కూడా కనిపిస్తాయట.

కాగా 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్‌ 8వ తేదీన వాషింగ్టన్‌ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.

Advertisement
Advertisement