పురుషుల అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌..! | Sakshi
Sakshi News home page

పురుషుల అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌..!

Published Wed, May 29 2019 5:10 PM

Transgender Man To Compete Male Pageant In Brazil - Sakshi

బ్రజీలియా : లింగమార్పిడి చేసుకున్న ఓ వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పురుషుల అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనున్నారు. పుట్టుకతో స్త్రీ అయిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో.. లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. బ్రెజిల్‌లో జరుగనున్న ‘మిస్టర్‌ బ్రెజిల్‌’ అందాల పోటీలకు ఎంపికయ్యాడు. ‘పుట్టుకతో అమ్మాయినైనా.. ఎప్పుడూ అలా అనిపించలేదు. నాలో పురుష లక్షణాలే అధికం. అందుకే లింగమార్పిడి చేయించుకున్నా. మిస్టర్‌ బ్రెజిల్‌ టైటిల్‌ సాధించడమే నా కల. రియోడాస్‌ పెడ్రాస్‌ పట్టణం నుంచి పోటీలో ఉన్నాను. ఇప్పుడు మోడల్‌గా పనిచేస్తున్నాను. మనదైన జీవితాన్ని పొందకుండా వెనకాడుతున్న చాలామందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాను’అని బెర్నార్డో చెప్పుకొచ్చారు. కాగా, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రెజిల్‌ చట్టం చేసింది. ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన వారంలోపే బెర్నార్డో పోటీ విషయం బయటికి రావడం విశేషం. రియో పట్టణంలో ఈ పోటీలు జరుగనున్నాయి. బెర్నార్డోతో పాటు మరో 19 మంది బరిలో ఉన్నారు.

Advertisement
Advertisement