Sakshi News home page

ఆమె పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Published Wed, May 25 2016 6:28 PM

ఆమె పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

లైలాంగ్వే: బాల్య వివాహాలపై ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతమంది ఎదురువచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆగ్నేయ ఆఫ్రికా లోని భూపరివేష్టిత దేశం మాలావి. థెరిసా కచిండమోటో సాధారణ గిరిజన మహిళగా ఉండాలనుకోలేదు అందుకే అక్కడ ఆమె ఓ శక్తిగా మారింది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, ఆచరాలకు అడ్డుకట్ట వేయడానికి నిరంతరం కృషిచేశారు. మూడేళ్ల కాలవ్యవధిలోనే 850కి పైగా బాల్య వివాహాలను ఆమె అరికట్టారు. 9 లక్షలకు పైగా జనాభా ఉండే డేడ్జా జిల్లాకు ఆమె అనధికారిక పరిపాలకురాలు. అక్కడ ఆమె ఓ వ్యవస్థగా మారిపోయారు.

బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉన్న 20 దేశాలలో ఎనిమిదో స్థానంలో మాలావి ఉంది. డేడ్జా జిల్లాలో 50 మంది అధికారులకు ఆమె నియమించి బాల్య వివాహాలు అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచలోనే బాల్య వివాహాల ర్యాంకులలో మాలావి టాప్ టెన్ లో ఉంటుంది. అక్కడ 15 ఏళ్ల వయసున్న ప్రతి 8 మంది బాలికలలో ఇద్దరిది బాల్యవివాహమే. వివాహ చట్టాన్ని తీసుకువచ్చి ఏజ్ లిమిట్ నిబంధనలు అమలుకోసం ప్రయత్నించి సక్సెస్ సాధించారు. 2015లో వివాహ వయసును 18 ఉండేలా చట్టాలను తీసుకొచ్చారు. అక్కడి వారికి ఆమె ఓ ఐకాన్ గా నిలుస్తున్నారు. బాలికల పాలిట ఆమె నిజంగానే దేవతగా మారారు. బాలికలను చదివిస్తే వారే భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారని ఆమె పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో చెబుతూ ఎంతో మందిని ఇందులో భాగస్వాములయ్యేలా చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement