'నేనంటేనే లా అండ్ ఆర్డర్' | Sakshi
Sakshi News home page

'నేనంటేనే లా అండ్ ఆర్డర్'

Published Tue, Jul 12 2016 8:37 AM

'నేనంటేనే లా అండ్ ఆర్డర్' - Sakshi

వాషింగ్టన్: తానంటేనే లా అండ్ ఆర్డర్ అని తనని తాను అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అభివర్ణించుకున్నారు. ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చాలా బలహీనం అని చెప్పారు. 'నేను ఒక శాంతి భద్రతల అభ్యర్థిని. హిల్లరీ క్లింటన్ ఇందులో బలహీనురాలు, ప్రభావం చూపలేని వ్యక్తి, భయంగల వ్యక్తి' అంటూ ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఒకప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రైవేటు ఈ మెయిల్స్ ను ఉపయోగించిందని చెప్పారు.

దీని ప్రకారం ఆమె అబద్ధాల కోరు అని అనుకోవచ్చంటూ వర్జీనియా బీచ్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలోచెప్పారు. తాను దయ కూడా కలిగిన వ్యక్తినని, ఈ విషయం ప్రతి ఒక్కరు నమ్మాలని చెప్పారు. కానీ, భద్రతను కల్పించలేని దయ దయ కాదని, భద్రత లేకుంటే ఏమీ లేనట్లేనని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా డల్లాస్ కాల్పులను కూడా ఆయన ప్రస్తావించారు. ఐదుగురు పోలీసులపై దాడి జరగడాన్ని దేశంపైన జరిగిన దాడిగానే ఆయన అభివర్ణించారు. అయితే, ఇలాంటి సంఘటనల విషయంలో ఒక ప్రత్యేక కార్యచరణ ఉండాలని అన్నారు.

Advertisement
Advertisement