గ్రీన్ కార్డు ఉన్నవారికి మినహాయింపు! | Sakshi
Sakshi News home page

గ్రీన్ కార్డు ఉన్నవారికి మినహాయింపు!

Published Tue, Feb 21 2017 1:30 AM

గ్రీన్ కార్డు ఉన్నవారికి మినహాయింపు! - Sakshi

వాషింగ్టన్‌: సవరించిన వలస నిషేధ ఉత్తర్వుల్లోనూ ట్రంప్‌ ఆ ఏడు ముస్లిం దేశాలనే లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. కాకుంటే గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు వలస నిషేధ ఉత్తర్వులు జారీ చేయడంతో నిరసనలు పెల్లుబికాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ వలసపై కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేస్తానని చెప్పారు. కానీ ట్రంప్‌ తీసుకురాబోతున్న పునఃసమీక్షించిన వలస నిషేధ ఉత్తర్వుల్లోనూ మళ్లీ ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే గ్రీన్‌ కార్డు కలిగి ఉన్నవారిని ఆ నిషేధం నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారిని అమెరికాలోకి అనుమతిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తర్వు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులందరికీ అందిందని, తుది ము సాయిదా త్వరలోనే విడుదల చేస్తామని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి సారా హకబీ శాండర్స్‌ చెప్పారు. దీనిపై హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ వెంటనే స్పందిం చలేదు. సమీక్షించిన ముసా యిదా మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్‌ చేస్తుందని, కానీ ఈ నిషేధం నుంచి గ్రీన్‌ కార్డులున్నవారిని మినహాయిస్తున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది.

ముస్లింలకు మద్దతుగా ర్యాలీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానాలకు వ్యతిరేకంగా, ముస్లింలకు మద్దతుగా టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వేలాదిమంది ‘నేనూ ముస్లింనే’ నినాదంతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా విభిన్న మతాలకు చెందిన వారంతా ‘నేనూ ముస్లింనే’అంటూ మద్దతు ప్రకటించారు. ట్రంప్‌ను వ్యతిరేకించండి, ముస్లింపై నిషేధం వద్దు అన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ సాగిన ఈ ర్యాలీ రచయిత రసెల్‌ సిమన్స్ , నటి సుసాన్ శారండన్  ఆధ్వర్యంలో సాగింది.

Advertisement
Advertisement